ముద్దనూరు మండలం ఎంపీడీఓ ముకుందరెడ్డి పలు విషయాలు బుధవారం ప్రకటన ద్వారా తెలిపారు. ఈ నెల డిసెంబర్ 26 వ తేదీ నుండి 28 వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలలో బాల ఆధార్ చేయుటకు ప్రత్యేక ఆధార్ క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు. 26వ తేదీన పెనికలపాడు అంగన్వాడీ సెంటర్లో, 27వ తేదీ యామవరం అంగన్వాడీ సెంటర్లో, 28వ తేదీన ముద్దనూరు 1 అంగన్వాడీ సెంటర్లలో ప్రత్యేక ఆధార్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.