తొండూరు: రెవెన్యూ గ్రామ సభలను సద్వినియోగం చేసుకోండి
రైతులు తమ భూసమస్యలపై గ్రామ రెవెన్యూ సభలను సద్వినియోగం చేసుకోవాలని రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్ రాజేశ్వరి అన్నారు. మంగళవారం తొండూరు మండలంలోని ఇనగలూరులో పంచాయతీ వద్ద రెవెన్యూ సభ నిర్వహించారు. ఇందులో సుమారు 20 మంది రైతులు తమ భూ సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.