బధిరుల క్రికెట్ టోర్నమెంటు లో తెలంగాణ విజయం

71చూసినవారు
బధిరుల క్రికెట్ టోర్నమెంటు లో తెలంగాణ విజయం
చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని కెఒఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో సోమవారం జరిగిన బధిరుల టి-20 క్రికెట్‌ టోర్నమెంటు ఫైనల్‌ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టుపై తెలంగాణ జట్టు విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు బిల్లా రాజు నాయకత్వం వహించగా తెలంగాణ జట్టుకు జి. రాజారాం కెప్టెన్‌గా వ్యవహరించారు. హోరాహోరీగా జరిగిన ఈ పోటీలలో తెలంగాణ జట్టు ప్రథమ స్థానంలో నిలవగా రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు నిలిచింది.

సంబంధిత పోస్ట్