దువ్వూరు: కుక్కల దాడిలో 30 గొర్రెల మృతి

82చూసినవారు
దువ్వూరు: కుక్కల దాడిలో 30 గొర్రెల మృతి
దువ్వూరుకు చెందిన గొర్రెల కాపరి పి. ఓబులేసు గొర్రెల మందపై బుధవారం వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలో 30 గొర్రెలు మృతి చెందాయి. 20 గొర్రెలు గాయపడగా వాటికి పశువైద్యాధికారి ఫణింద్రరెడ్డి చికిత్స నిర్వహించారు. వీధి కుక్కల దాడి నుండి పశువులను, ప్రజలను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్