ప్రొద్దుటూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని భూమికి సంబంధించి సర్వేను గురువారం అధికారులు చేపట్టారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హేమావతి ఆధ్వర్యంలో ల్యాండ్ సర్వే, రెవెన్యూ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అధికారులు ల్యాండ్ సర్వేను చేపట్టారు. ఇందులో మొత్తం ఫారెస్ట్ భూమి విస్తీర్ణాన్ని, అందులో ఆక్రమణకు గురైన విస్తీర్ణాన్ని గుర్తించనున్నారు. కార్యక్రమంలో పలు శాఖలు అధికారులు పాల్గొన్నారు.