ప్రొద్దుటూరులో ఆరు రోజుల క్రితం ఓ లాడ్జిలో జరిగిన రాఘవేంద్ర అలియాస్ పప్పి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. శనివారం ప్రొద్దుటూరు పోలీసు స్టేషన్ లో డీఎస్పీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాత కక్షల కారణంగానే పప్పిని మద్యం బాటిల్తో కొట్టి, గొంతుపై కాలు పెట్టి హతమార్చినట్లు డీఎస్పీ భక్తవత్సలం పేర్కొన్నారు. ఈ హత్య కేసులో యనమల లోకేశ్వర్ రెడ్డి, ముజీబ్, సునీల్ను అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.