చక్రాయపేట మండలం గండికోవూరులో వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్టు జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. కడప ఎస్పీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన నిందితుల వివరాలను వెల్లడించారు. గండి కొవ్వూరుకి చెందిన హరిజనవాడలో తమ ఇంటి వద్దకు మురుగునీళ్లు వస్తున్నాయంటూ గొడవపడి ఆంజనేయులు అనే వ్యక్తిని హతమార్చారు. చివరికి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.