ఎండ వేడిమికి అల్లాడుతున్న వేముల మండలం గురువారం మధ్యాహ్నం కురిసిన జోరు వర్షంతో ఉక్కపోత నుండి ఉపశమనం కలిగింది. గురువారం మధ్యాహ్నం ఉన్న పలంగా వర్షం కురిసింది. దీంతో వేముల మండలం కాస్త చల్లబడగా, రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కడప జిల్లాలోని పలు ప్రాంతాలలోనూ మధ్యాహ్నం నుంచి తేలికపాటి జల్లులు కురిశాయి.