కోట్ల రూపాయలు సంపాదించానని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆరోపిస్తున్నారని దీనిని రాచమల్లు నిరూపించాలని వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ శనివారం అన్నారు. ప్రొద్దుటూరులో బీసీ నేతను ఎవరు చంపించారో అందరికీ తెలుసన్నారు. ఇప్పటి ప్రభుత్వం వచ్చాక రాచమల్లు ఎవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పాలన్నారు. తనకేమైనా జరిగితే వైసీపీ నేతలు, వివేకా హత్య కేసు నిందితులదే బాధ్యత అని కడపలో మీడియా సమావేశంలో అన్నారు.