పులివెందుల: ప్రమాదవశాత్తు అదుపు తప్పి అరటి కాయల లారీ బోల్తా

68చూసినవారు
పులివెందుల: ప్రమాదవశాత్తు అదుపు తప్పి అరటి కాయల లారీ బోల్తా
పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో ఆదివారం మధ్యాహ్నం అరటి తోటల వద్ద అరటి కాయల లారీ బోల్తా పడింది. రైతు విశ్వనాథరెడ్డికి చెందిన లారీ అరటికాయలు కోసేందుకు తోట వద్దకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో కూలీలందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి రోడ్డు గుంతలమయం కావడమే కారణమని కూలీలు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్