పులివెందుల: కారుపై కుప్పకూలిన కాంపౌండ్ వాల్

50చూసినవారు
పులివెందుల పట్టణంలోని మున్సిపాలిటీ రికవరీ సెంటర్ సమీపంలోని సదాశివారెడ్డి హాస్పిటల్ పక్కన కాంపౌండ్ వాల్ గురువారం అకస్మాత్తుగా కూలిపోగా, కారుపై గోడ శిథిలాలు పడ్డాయి. అక్కడే ఉన్న విద్యుత్ స్తంభంనేల వాలింది. దీంతో చుట్టుపక్కల ఇండ్లలో కూలర్లు, ఫ్రిడ్జ్లు, కంప్యూటర్లు కాలిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. ఈ విషయాన్ని స్థానికులు, మున్సిపల్ సిబ్బంది సంబంధిత అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని వారు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్