పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రంరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీహరి స్వామి మహారాజ్ మఠంలో శ్రీ హరి స్వామి ఆరాధన మహోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం అర్చకులు శ్రీహరి స్వామిని ప్రత్యేకంగా అలంకరించి హారతి ఇచ్చారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.