వేముల మండలంలోని టిఫిన్ బైరటీస్ కంపెనీకి గతంలో లీజుకు గనులను తీసుకొచ్చానని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్ధసారధి రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం పులివెందుల పట్టణంలోని స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఫిన్ బైరటీస్ కంపెనీకి తాను తెచ్చిన లీజులు తప్ప, తర్వాత ఆ కంపెనీకి ఎటువంటి లీజులులేవన్నారు.