పులివెందులలోని భాకరాపురం సమీపంలో ఉన్న స్మశాన వాటికలో సిట్, రెవెన్యూ బృందాల ఆధ్వర్యంలో శనివారం రంగన్న మృతదేహాన్ని తవ్వి 4 గంటలపాటు రీపోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రంగన్న మృతదేహం నుంచి పలు నమూనాలను సేకరించారు. రంగన్న మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరింత లోతుగా విచారణ చేసేందుకు రీపోస్టుమార్టం నిర్వహించాలని సిట్ బృందం భావించింది.