బిఆర్ అంబేడ్కర్ పై ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాలలో కేంద్రమంత్రి అమిత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఈ నేపథ్యంలో దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ధృవకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం పులివెందుల పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్ అంబేడ్కర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని అందరికీ క్షమాపణలు చెప్పాలన్నారు.