సింహాద్రిపురం కస్తూర్బా గాంధీ విద్యాలయంలో సోమవారం విద్యార్థినులతో కలిసి రూరల్ సీఐ వెంకటరమణ, ఎస్సై తులసి నాగప్రసాద్లు హాకీ ఆడారు. హ్యాపీ అవర్స్ డే సందర్భంగా విద్యార్థినులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు హాకీ క్రీడాకారులను పరిచయం చేసుకుని కాసేపు సరదాగా హాకీ ఆడారు. అనంతరం గెలుపొందిన హాకీ క్రీడాకారులకు వారు బహుమతులను అందజేశారు.