పులివెందులలో ఘనంగా శ్రీత్యాగరాజస్వామి ఆరాధన

81చూసినవారు
నాదయోగి శ్రీత్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలను పులివెందుల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. శనివారం నాయీ బ్రాహ్మణులు ప్రత్యేక పల్లకిని ఏర్పాటు చేసి అందులో త్యాగరాజ స్వామి చిత్రపటాన్ని ఉంచి, వీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ గ్రామోత్సవాన్ని వారు మంగళ వాయిద్యాలతో తూర్పు ఆంజనేయస్వామి ఆలయం వరకు నిర్వహించారు. అక్కడ భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్