వైసిపి ప్రభుత్వం చీకటి పాలనలో చితికిపోయిన గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్, నియోజకవర్గ టిడిపి బాధ్యులు రూపానందరెడ్డి అన్నారు. శుక్రవారం 2 కోట్ల రూపాయలు వ్యయంతో మైసూరా వారి పల్లి గ్రామంలో డ్రైనేజీ కాలువలు, సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. రాబోయే రోజులలో ప్రతి పల్లె లోనూ మౌలిక వసతులు కల్పిస్తామని వారు హామీ ఇచ్చారు.