పోలీసుల అండతో ఎస్టి ఎస్సి లకు చెందిన భూములను అగ్రవర్ణాల వారు కబ్జా చేస్తున్నారని రైల్వే కోడూరు నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య అన్నారు. ఆదివారం దేవమాచు పల్లికి చెందిన ఆకేపాటి బాలచంద్రా రెడ్డి జెసిబి లు పెట్టి గతంలో ఎస్సీ ఎస్టీలు కేటాయించిన భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్నామని తెలిపారు. సర్వే నెంబర్ 652, 653 లో 7. 20 ఎకరాలు 1993లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారని ఆయన అన్నారు.