ఎన్టీఆర్ భరోసా పింఛన్లనుఆగస్టు 31వ తేదీన పంపిణీ చేయనున్నట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ శుక్రవారం పేర్కొన్నారు. సెప్టెంబరు 1న ఆదివారం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. 31వ తేదీన పెన్షన్లు అందకపోతే సెప్టెంబరు 2వ తేదీన పింఛన్లు అందజేస్తామన్నారు. 2 వ తేదీ తర్వాత పింఛన్లు అందవని, కావున పింఛనర్లు ఈ నెల 31న గ్రామాల్లో అందుబాటులో ఉండాలన్నారు.