చిట్వేలి మండలం నెత్తివారిపల్లి పంచాయతీలో ఎస్టీ, బీసీ కాలనీలను స్థానిక సర్పంచ్ గుండయ్య యాదవ్, ఎన్డీఏ నాయకులుశుక్రవారం సందర్శించారు.అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్న కాలనీలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి తనయుడు సాయి వికాస్ రెడ్డి హామీ ఇచ్చారు.రహదారుల సవరణ, విరిగిన విద్యుత్ స్థంబాల పునర్నిర్మాణం, త్రాగునీటి పైపులైన్ ఏర్పాటు చేస్తామని అన్నారు.