ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కారం మార్గంగా పయనిస్తానని రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి భత్యాల చెంగల రాయుడు అన్నారు. ఆయన మంగళవారం బోటుమీదపల్లి ఎస్టీ కాలనీలో పర్యటించారు. గ్రామస్థులు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వాటికి త్వరితగతిన పరిష్కార మార్గాలు చేపడతామని అన్నారు.