రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసిందని తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు. శుక్రవారం రాజంపేట మండలం వరదయ్య గారి పల్లెలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడుతూ సమస్య మీది పరిష్కారం మాది అంటూ భూములకు సంబంధించిన ప్రతి సమస్యను అర్జీ రూపంలో ప్రజలు అధికారులకు సమర్పించాలని అన్నారు. సమస్యలను త్వరలో అధికారులు పరిష్కరిస్తారని అన్నారు.