ఆశాజనకంగా రబీ వరి దిగుబడులు

56చూసినవారు
ఆశాజనకంగా రబీ వరి దిగుబడులు
కాకినాడ జిల్లాలో రబీ వరి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని, ఇప్పుడిప్పుడే వరి కోతలు ప్రారంభమవుతున్నాయని జిల్లా వ్యవసాయ అధికారి ఎన్‌. విజయకుమార్‌ మంగళవారం అన్నారు. రైతులు తమ ధాన్యంలో 17 శాతం వరకూ తేమ ఉండేలా చూసుకోవాలని, ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తాం అని చెప్పారు. కోసిన ధాన్యాన్ని అధిక ఉష్ణోగ్రతల్లో ఎండబెట్టకూడదని, ప్రభుత్వం నిర్ణయించిన 17 శాతం తేమకు అనుగుణంగా ఎండబెట్టుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్