వైసీపీ ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి జరిగింది

53చూసినవారు
వైసీపీ ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి జరిగింది
ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తోందని వైఎస్సార్సీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత అన్నారు. పిఠాపురం మండలంలో రాయవరంలో గురువారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని వివరించారు. గత ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదని, వైసీపీ ప్రభుత్వంలో మాత్రమే గ్రామాల అభివృద్ధి జరిగిందన్నారు.