ప్రత్తిపాడు: లింగంపర్తిలో ఎక్సైజ్ దాడులు

75చూసినవారు
ప్రత్తిపాడు: లింగంపర్తిలో ఎక్సైజ్ దాడులు
ప్రత్తిపాడు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో సారా స్థావరాలపై మంగళవారం విస్తృత దాడులు నిర్వహించినట్టు స్థానిక ఎక్సైజ్ సీఐ పి శివ ప్రసాద్ తెలిపారు. జిల్లా ఎక్సైజ్ సూపరిటెం డెంట్ కృష్ణకుమారి ఆదేశాల మేరకు ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలోని సారా స్థావరాలపై దాడులు నిర్వహించి 600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామన్నారు. సారా తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్