కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్యతో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవలే కురిసిన వర్షాలకు తుని నియోజకవర్గంలో జరిగిన నష్టంపై ప్రత్యేకంగా చర్చించారు. అనంతరం మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుతో సైతం మాజీ ఎమ్మెల్యే అశోక్ సమావేశమై పలు విషయాలు చర్చించారు. వరద నష్టంపై పలు చర్యలు తీసుకోవాలని కోరారు.