టిడిపిని వీడి దాడిశెట్టి రాజా సమక్షంలో చేరికలు

83చూసినవారు
టిడిపిని వీడి దాడిశెట్టి రాజా సమక్షంలో చేరికలు
తుని నియోజకవర్గం రాష్ట్ర రహదారులు మరియు భవనముల శాఖామాత్యులు దాడిశెట్టి రాజా సమక్షంలో తుని మండలం H. కొత్తూరు గ్రామ సర్పంచ్ కటారి సుబ్బారావు ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన ములికి పాములయ్యా, నక్కా నాగరాజు, నక్కా సుబ్బారావు, గంటా లోవరాజు, ములికి నాగ సత్యనారాయణ, ములికి అప్పన టీడీపీ పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలకు మరియు దాడిశెట్టి రాజా నాయకత్వానికి ఆకర్షితులై వైసీపీలో చేరుతున్నట్లు వారు తెలియచేసారు. మంత్రివర్యులు దాడిశెట్టి రాజా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్