కాకినాడ జిల్లా తుని పట్టణం మీదుగా తాండవ నది పరివాహక ప్రాంత నీరు బుధవారం ఉదయం నిలకడగా ప్రవహిస్తుంది. రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఈ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. దీంతో పల్లపు ప్రాంత ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. జంట జిల్లాలకు సంబంధించి తుని పాయకరావుపేట బ్రిడ్జి మీదుగా ఈ ప్రవాహం ప్రస్తుతం ప్రశాంతంగా సాగుతుంది.