
‘జగన్ పోలీసులపై బెదిరింపు వ్యాఖ్యలు మానుకోవాలి’
మాజీ సీఎం జగన్ పోలీసులపై బెదిరింపు వ్యాఖ్యలు మానుకోవాలని ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు హితవు పలికారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని, పోలీసు అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా వారిని తీసుకొచ్చి బట్టలూడదీసి నిలబెడతామని మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. జగన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు.