స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల కాకినాడలో జరిగిన అండర్ 14 స్కేటింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచి జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీలకు అమలాపురం పట్టణానికి చెందిన కోటం కుమార్ చందు శ్రీధర్ ఎంపికయ్యాడు. అతనిని ఉప్పలగుప్తం మండల తహశీల్దార్ వాసా సామ్యూల్ దివాకర్ బుధవారం అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో రాణించాలని అన్నారు.