అంబేడ్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా అమలాపురంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించారు. గురువారం రాత్రి అమలాపురం పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభిమానులు వారిపై పూల వర్షం కురిపించారు. అనంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమలాపురంలోని సభా స్థలానికి చేరుకున్నారు.