డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపల్ కమిషనర్ గా కెవిఆర్ఆర్ రాజు సోమవారం బాధ్యతలు చేపట్టారు. గుంటూరు డిఎంఏ కార్యాలయంలో పనిచేస్తూ బదిలీపై కమిషనర్ గాఅమలాపురం వచ్చారు. బాధ్యతలుచేపట్టిన అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఇప్పటివరకు అమలాపురం కమిషనర్ గా పనిచేసినఎస్. మనోహర్ కాకినాడ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ గా బదిలీ అయ్యారు.