కొంకుదురు కేఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999-2000 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులు గురువారం కలుసుకున్నారు. ఆ పాఠశాలలో చదువు పూర్తి అయిన తర్వాత వివిధ రకాల వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలలో స్థిరపడిన వారంతా 25 సంవత్సరాల తరువాత తాము చదువుకున్న పాఠశాలలో కలుసుకుని చదువు నేర్పిన గురువులను సన్మానించుకుని, సహపంక్తి భోజనాలు చేసి, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.