బిక్కవోలు మండలం బలబద్రపురం లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో శనివారం బేటీ బచావో బేటి పడావో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని 70 మంది బాలింతలకు సిమంతం చేశారు. వివిధ పోటీల్లో గెలుపొందిన బాలికలకు బహుమతులు ప్రధాన ఉత్సవం చేశారు. బాలికలు మహిళల ఆరోగ్య సంరక్షణ కోసమే ఐసిడిఎస్ వ్యవస్థ ఏర్పడిందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.