బిక్కవోలులోని కుమార సుబ్రహ్మణ్య స్వామి షష్టి ఉత్సవాల్లో భాగంగా విశేష సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులను గురువారం రాత్రి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారికి సాలువ కపి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన అన్న సమరాధనా కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులకు స్వయంగా భోజనాలు వడ్డించారు.