పెదపూడి మండలంలోని దోమడ గ్రామ ఎంపీపీ పాఠశాలలో శనివారం విద్యా కమిటీ చైర్మన్ సవరపు చిట్టిబాబు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసుల సారథ్యంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో విలువలు పెంపొందించుటకు చదువు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అంతకుముందు విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.