పెదపూడి మండలం దోమడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మండల ఆర్యవైశ్య అధ్యక్షులు ఓబిలిశెట్టి సత్తిబాబు ఆధ్వర్యంలో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఓబిలిశెట్టి సత్తిబాబు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ సవరపు చిట్టిబాబు, బిజెపి నాయకులు కాక గోవిందు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.