దేవరపల్లి గ్రామంలో వేంచేసి ఉన్నా పురాతన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో శనివారం షష్టి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూఉన్నాయి. మండలంలో పెద్ద ఆలయం అవడంతో సుబ్బారాయుడు గుడి సెంటర్ వద్ద ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తులు తెల్లవారుజామున నుంచె అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో తమ మొక్కులను తీర్చుకుంటున్నారు. భక్తులు సుమారు కిలోమీటర్లు మేర క్యూలో నిలబడి అధిక సంఖ్యలో తరలివచ్చారు.