గ్రామస్థాయిలో రెవెన్యూ అధికారి భూ సంబంధ అర్జీలను స్వీకరించడం ద్వారా పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ రాజ్యలక్ష్మి తెలిపారు. గురువారం బందపురంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా రెవెన్యూ సదస్సుల ద్వారా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇది నిరంతర ప్రక్రియని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి రుసుమును చెల్లించక్కర్లేదన్నారు.