రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా అవమానకర వ్యాఖ్యలు అమానుషమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టికె విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం గోపాలపురం చెక్ పోస్టు వద్ద గల అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆ పార్టీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం మండల అధ్యక్షుడు మట్టపర్తి రామ్మోహన్రావు, దేవరపల్లి మండల సీనియర్ నాయకులు వెలగా రామకృష్ణ ఉన్నారు.