జగ్గంపేట: గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అవగాహన

58చూసినవారు
జగ్గంపేట: గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అవగాహన
జగ్గంపేట శివారులో ఉన్న బాలయోగి గురుకుల బాలికల పాఠశాలలో శనివారం పేరెంట్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు, స్థానిక సీఐ శ్రీనివాస్ లు పాల్గొన్నారు. డీఎస్పీ శ్రీహరిరాజు మాట్లాడుతూ విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్ధులు అపరిచిత వ్యక్తులతో మాట్లాడవద్దని, సెల్ఫోన్ కు దూరంగా ఉండి లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు.

సంబంధిత పోస్ట్