పేదల ఆకలి తీర్చేందుకుగాను కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని ఏర్పాటు చేసిన ఐదు అన్న క్యాంటీన్లను శుక్రవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభించనున్నట్టు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన తెలిపారు. గురువారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. కాకినాడ నగరంలోని అన్నమఘాటీ సెంటర్, రమణయ్యపేట బోట్‌క్లబ్, సంత చెరువు, వివేకానంద పార్కు, డెయిరీ ఫారమ్ సెంటర్లలోని అన్నక్యాంటీన్ లు అందుబాటులో ఉంటాయన్నారు.