శ్రీ బాలా త్రిపురసుందరీ ఆలయంలో భక్తులు కిటకిట

72చూసినవారు
శ్రీ బాలా త్రిపురసుందరీ ఆలయంలో భక్తులు కిటకిట
కాకినాడ లో శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్భంగా అత్యధిక సంఖ్యలో వచ్చిన భక్తులతో శ్రీ బాలా త్రిపురసుందరీ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కిటకిటలాడింది. ఆలయంలో ఉదయం స్వామి వారి కి పంచామృత అభిషేకాలు, అమ్మవారికి నవావరణ, సహస్రనామార్చన పూజలు చేశారు. భక్తులకు నిత్యాన్న సదనంలో భోజన ఏర్పాట్లు  చేశారు. అమ్మవారు బంగారు చీరలో దర్శించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్