వైసిపి పార్టీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడలో చేసిన దౌర్జన్యాలపై జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ కు కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసిపి ఐదేళ్ల పాలనలో కాకినాడలో దౌర్జన్యం దాడులు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై కూడా దాడులు చేయడం జరిగిందన్నారు.