కాకినాడ: సహకార ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా

57చూసినవారు
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. జీవో నెంబర్ 36 ప్రకారం పే స్కేల్ అందరికీ అమలు చేయాలని, 2019 తర్వాత చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని యూనియన్ నాయకులు ఆదినారాయణ డిమాండ్ చేసారు. జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె. ఆదినారాయణ మాట్లాడారు.

సంబంధిత పోస్ట్