కాకినాడ జిల్లా పెరేడ్ పోలీస్ మైదానం లో9వ రోజు శుక్రవారం కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షకు 363 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. తదుపరి పరీక్షకు 272 మంది అభ్యర్ధులు అర్హత సాధించినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిరాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.