ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలలో (పీజీఆర్ఎస్) అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్ణీత గడువులోగా పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తదితర అధికారులు హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.