పెద్దాపురం మండలం దీవిలి గ్రామానికి చెందిన కొత్తం వెంకట శ్రీనివాసరావు, ఊడి శ్రీనులపై శనివారం ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేసినట్లు పెద్దాపురం ఎస్ఐ మౌనిక తెలిపారు. సెప్టెంబర్ 23న దివిలి గ్రామంలో జరిగిన గ్రామసభలో వీరిద్దరూ తమను కులం పేరుతో దూషించి అవమానించారంటూ ఆ గ్రామానికి చెందిన మాజీ సర్పంచి గొడత లక్ష్మితోపాటు మరికొందరు లఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మౌనిక పేర్కొన్నారు.