ఆంద్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి తూర్పు, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజక వర్గ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఉపాధ్యాయ ఓటర్ల నవీకృత జాబితా రూపకల్పనకు ఎన్నికల కమీషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం చర్యలు చేపట్టాలని కాకినాడ ఆర్ డిఓ ఇట్ల కిషోర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయ ఓటర్ల నమోదు ప్రక్రియపై సమావేశం నిర్వహించారు.